శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును భోగి మంటల్లో తగులబెట్టిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినట్టు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్ తెలిపారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీఆర్‌ఎస్ వినతి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును భోగి మంటల్లో తగులబెట్టిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినట్టు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి పంపిన బిల్లును భోగిమంటల్లో తగులబెట్టడంద్వారా రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. బిల్లు ముసాయిదాను తగులబెట్టాలంటూ పిలుపునిచ్చిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై, బిల్లు ప్రతులను తగులబెట్టిన నేతలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.