26 కేంద్రాల్లో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ పరీక్షలు | Stealpland job tests in 26 centers | Sakshi
Sakshi News home page

26 కేంద్రాల్లో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ పరీక్షలు

Jul 10 2017 3:21 AM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాలకు సంబంధించి ఆదివారం జిల్లాలోని 26 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం రెండు పూట లా పరీక్షలు నిర్వహించాలి.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాలకు సంబంధించి ఆదివారం జిల్లాలోని 26 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం రెండు పూట లా పరీక్షలు నిర్వహించాలి. కానీ ఒక్కపూటతోనే స్టీల్‌ప్లాంట్‌ అధికారులు పరీక్షలు నిలిపివేశారు. కలాసీ అభ్యర్థులకు మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసినా చివరి క్షణంలో పరీక్ష రద్దు చేశారు. దీంతో కొందరు అభ్యర్థులు పలు కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని చైతన్య కళాశాల ఆవరణలో అభ్యర్థులు హాల్‌ టికెట్లతో నిరసన తెలిపారు.

అలాగే నగరంలోని ఆర్‌వీఎం కార్యాలయం వద్ద గల ఓ పరీక్ష కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్లు అభ్యర్థులు తెలిపారు. కొందరికి ఉద్యోగాలు ఇప్పించేందుకు గాను కొంతమంది అవినీతికి పాల్పడి, ఇలా వారి అభ్యర్థులకు మాస్‌ కాపీయింగ్‌ ద్వారా సాయం చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలకు సుమారు పదివేల మంది దరఖాస్తు చేసుకోగా 60 శాతం మంది మాత్రమే హాజరైనట్లు స్టీల్‌ప్లాంట్‌ అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణను పలు ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించడంతో పలు కేంద్రాల్లో కాపీయింగ్‌ జరిగినట్లు అభ్యర్థులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement