విభజనతో రాష్ట్రం అల్లకల్లోలం | State splitting turbulence | Sakshi
Sakshi News home page

విభజనతో రాష్ట్రం అల్లకల్లోలం

Sep 11 2013 4:48 AM | Updated on Apr 7 2019 4:30 PM

మహానేత వైఎస్‌ఆర్ జీవించే ఉంటే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు.

మార్కాపురం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్‌ఆర్ జీవించే ఉంటే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చేది  కాదని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ  పేర్కొన్నారు.  సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర మంగళవారం రాత్రి మార్కాపురం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన  సభలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆర్ మరణంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిం దన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై జననేత జగన్‌మోహన్‌రెడ్డిని జైళ్లో పెట్టించి విభజనకు కుట్రలు పన్నాయని విమర్శించారు.
 
  మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించే హక్కు కాంగ్రెస్, టీడీపీలకు ఎవరిచ్చారని ప్రశ్నించా రు. టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు తక్షణమే రాజీనా మా చేసి ఉద్యమంలోకి రావాలని కోరారు. వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని  విమర్శించారు. విభజనతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు అందక సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర మంత్రులు వెంటనే రాజీనామా చేస్తే కేంద్రంపై వత్తిడి పెరిగి విభజన ప్రక్రియ ఆగిపోతుందని స్పష్టం చేశారు. ఉడుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ చేస్తున్న పోరాటాలకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంత ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే టీడీపీ,
 
  కాంగ్రెస్ నేతలు రాజీనామా డ్రామాలాడుతూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబు.. ఇప్పుడు సీమాంధ్రులను మోసం చేసేందుకు యాత్ర పేరుతో ప్రజల్లోకి  వస్తున్నారని, కానీ  రాష్ట్ర ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ విభజన ప్రకటన వచ్చిన తర్వాత ఏపీ ఎన్జీఓలు సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబును కోరితే హామీ ఇవ్వకుండా..కొత్త రాష్ట్రంతో రాజధానికి రూ. 4 లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేసి, ఇప్పుడు యాత్రల పేరుతో ఎలా తిరుగుతున్నాడని ప్రశ్నించారు. 
 
 మరో సమన్వయకర్త  వై.వెంకటేశ్వరావు మాట్లాడుతూ విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సోనియా, చంద్రబాబులు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి కపట నాటకాలు ఆడుతున్నారన్నారు. అందరు ఐక్యంగా సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్ సీపీ చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అంధించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
 
  ఓదార్పుయాత్రలో జగన్‌పై చూపిన ప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్   కాటం అరుణమ్మ, మాజీ ఎమ్మెల్యేలు గరటయ్య, దారా సాంబయ్య, నాయకులు ఉడుముల లక్ష్మీనారాయణరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ యూత్ జిల్లా కన్వీనర్  కె.వి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement