వైభవంగా ముగిసిన శ్రీవారి వసంతోత్సవాలు | Srivari vasanthotsavam ended as grand | Sakshi
Sakshi News home page

వైభవంగా ముగిసిన శ్రీవారి వసంతోత్సవాలు

Apr 1 2018 3:55 AM | Updated on Aug 25 2018 7:11 PM

Srivari vasanthotsavam ended as grand - Sakshi

సాక్షి,తిరుమల: తిరుమలలో శనివారం శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి మలయప్పతోపాటు శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయుడు, రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి వసంతమండపానికి ఊరేగింపుగా వచ్చారు. తిరుమలకొండ శనివారం భక్తజన సంద్రంగా మారింది.  క్యూలోకి వెళ్లిన భక్తులు సుమారు 10 గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఇక కంపార్ట్‌మెంట్లలోనూ మరో 10 గంటలు పైబడి నిరీక్షించాల్సి వస్తోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం హుండీ కానుకలు రూ.3.10 కోట్లు లభించాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement