breaking news
sreevaru
-
వైభవంగా ముగిసిన శ్రీవారి వసంతోత్సవాలు
సాక్షి,తిరుమల: తిరుమలలో శనివారం శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి మలయప్పతోపాటు శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయుడు, రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి వసంతమండపానికి ఊరేగింపుగా వచ్చారు. తిరుమలకొండ శనివారం భక్తజన సంద్రంగా మారింది. క్యూలోకి వెళ్లిన భక్తులు సుమారు 10 గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఇక కంపార్ట్మెంట్లలోనూ మరో 10 గంటలు పైబడి నిరీక్షించాల్సి వస్తోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం హుండీ కానుకలు రూ.3.10 కోట్లు లభించాయి. -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
శ్రీవారి దర్శనానికి 10 గంటలు సాక్షి, తిరుమలః తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికి 62,069 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో నిండిన భక్తులకు 10 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. హుండీ కానుకలు రూ.3.29 కోట్లు వచ్చాయి.