
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం
సాక్షి, తిరుపతి : తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం శ్రీరామస్వామి వారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. స్వామి వారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు అశేషంగా తిరుమలకు చేరుకున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లోని ఒంటిమిట్ట, భద్రాచల దేవస్థానాల్లో సీతారామ కళ్యాణం కన్నులపండువగా జరగనుంది.