బీసీ సబ్‌ప్లాన్ తెస్తాం: మంత్రి పితాని | Special Sub-Plan for BCs: Pitani Satyanarayana | Sakshi
Sakshi News home page

బీసీ సబ్‌ప్లాన్ తెస్తాం: మంత్రి పితాని

Oct 19 2013 1:20 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఎస్సీ, ఎస్టీల సర్వతోముఖాభివృద్ధికి సబ్‌ప్లాన్ రూపొందించిన తరహాలోనే బీసీలకు కూడా ప్రత్యేక ఉప ప్రణాళిక అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు.


సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సర్వతోముఖాభివృద్ధికి సబ్‌ప్లాన్ రూపొందించిన తరహాలోనే బీసీలకు కూడా ప్రత్యేక ఉప ప్రణాళిక అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. 6.50 లక్షల మంది బడుగులకు ప్రయోజనం కలిగించే ఒక కొత్త కార్యక్రమాన్ని నవంబర్ నెలలో ప్రారంభిస్తామన్నారు. మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. వీటికి మంత్రులు పితాని సత్యనారాయణ, బస్వరాజు సారయ్య, ఎంపీ వి.హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పితాని ప్రసంగిస్తూ.. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది బీసీలకు ప్రత్యేక ఉప ప్రణాళికను ప్రవేశపెడతామని వెల్లడించారు. బీసీలకు అధిక సబ్సిడీతో రుణాలందించేందుకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమ మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షుడు లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement