నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు | Special officer on Nellore zp chairman election, High court order to State Election Commission | Sakshi
Sakshi News home page

నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు

Jul 10 2014 1:27 PM | Updated on Oct 20 2018 6:23 PM

నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు - Sakshi

నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. జడ్పీ ఛైర్మన్ ఎన్నిక స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలలో ఎన్నిక సంఘానికి సూచించింది. ఆ ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని కెమెరాలలో చిత్రీకరించాలని హైకోర్టు ఆదేశాలలో పేర్కొంది.

 

ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో ఛైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించే సమయానికి ఆదే జిల్లాకు చెందిన వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కె. రామకృష్ణ కలెక్టర్ ఎదుట వీరంగం సృష్టించాడు. దాంతో ఎన్నికలు ఈ నెల 13కు వాయిదా పడింది. జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సజావుగా జరిగే పరిస్థితి లేదని.... ఈ నేపథ్యంలో ఆ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అందులోభాగంగా హైకోర్టు గురువారంపై విధంగా స్పంధించింది.

Advertisement
 
Advertisement
Advertisement