నగరంలో ఆటోలపై ప్రత్యేక డ్రైవ్


ట్రాఫిక్ డిఎస్పీ ఆధ్వర్యంలో 100కుపైగా ఆటోలు సీజ్

ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలో ఆటోలపై ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ జె.రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది నగరంలోని పలు కూడళ్ళలో ఉండి ఆటోలను నిశితంగా తనిఖీ చేశారు. గత నెల రోజుల క్రితం ఆటో డ్రై వర్లను పిలిపించి ఒకటి, రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆటో డ్రై వర్లలో, యజమానులలో ఎలాంటి మార్పు రాలేదని ట్రాఫిక్ డిఎస్పీ జె.రాంబాబు పేర్కొన్నారు. రవాణా శాఖ నిబంధనల మేరకు ఆటోలు నగరంలో సంచరించాలని గతంలో పలుసార్లు చెప్పినప్పటికీ ఆటోడ్రై వర్లు, యజమానులు యథావిధిగా నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారని డిఎస్పీ చేపట్టారు.దాదాపు 100కుపైగా ఆటోలను సీజ్ చేశారు. పోలీస్ సీరియల్ నెంబర్ లేకపోవడం నిబంధనల మేరకు ఆటోలు ఉండకపోవడం లాంటి వాటిపై కూడా ట్రాఫిక్ పోలీసుల చర్యలు చేపట్టారు. ఆటోడ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం, డ్రై వింగ్ లెసైన్సు లేకుండా ఆటోలు నడపటంలాంటివి కూడా ఇప్పటి వరకు డ్రైవర్లు సరి చేసుకోలేదన్నారు. ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న ఆటోలను రంగారాయుడుచెరువు ప్రాంతంలో ఉన్న పివిఆర్ గ్రౌండ్‌కు తరలించారు.అక్కడ నిబంధనలు అతిక్రమించిన ఆటోలపై చర్యలు చేపట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమయ్యారు. నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించటంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటంలో భాగంగానే మొదటి విడత ఆటోలపై దష్టి సారించారని డిఎస్పీ పేర్కోన్నారు. ఆటోలు సక్రమంగా నగరంలో నడిచే విధంగా చూసిన తర్వాత అనంతరం ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు, ప్రై వేట్, ఆర్‌టిసి బస్సులపై దష్టి సారిస్తామని డిఎస్పీ వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top