వైఎస్సార్ సీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి హత్య ఘటనపై జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు సీరియస్ గా స్పందించారు.
అనంతపురం:వైఎస్సార్ సీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి హత్య ఘటనపై జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు సీరియస్ గా స్పందించారు. పెద్దవడుగూరు ఎస్సై నీరంజన్ రెడ్డితో సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. దీనికి సంబంధించి చార్జ్ మెమోను ఎస్పీ గురువారం జారీ చేశారు.
పెద్ద వడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి మంగళవారం ఉదయం టీడీపీ వర్గీయులు కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.సొసైటీ కార్యాలయంలో విజయ్ భాస్కర్రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.