నేడు జగన్ పర్యటన ఇలా.. | South Western Railway, Bangalore, electrical short circuit... | Sakshi
Sakshi News home page

నేడు జగన్ పర్యటన ఇలా..

Dec 29 2013 3:45 AM | Updated on Sep 5 2018 3:52 PM

నేడు జగన్ పర్యటన ఇలా.. - Sakshi

నేడు జగన్ పర్యటన ఇలా..

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఆదివారం పెద్దపంజాణి మండలంలోని కెళవాతి నుంచి ప్రారంభం.

పలమనేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర  ఆదివారం పెద్దపంజాణి మండలంలోని కెళవాతి నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలి పారు.  

చదళ్లవారి పల్లె, కొళత్తూరు, తుర్లపల్లెక్రాస్, తుర్లపల్లె, కొత్తూరులో రోడ్‌షో ఉంటుందన్నారు. పుంగనూరు మండలం బత్తలాపురంలో పితాంబరం కల్పన కుటుంబాన్ని  ఓదారుస్తారని తెలిపారు. అక్కడ నుంచి తుర్లపల్లె క్రాస్, నేలపల్లె, దిన్నెపలెల్లో రోడ్‌షో ఉంటుందని చెప్పారు.  మండల కేంద్రమైన  పెద్దపంజాణిలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, బసవరాజుకండిగ, కోగిలేరు, గుడిపల్లె క్రాస్‌ల్లో రోడ్‌షో, రాయలపేటలో జరిగే బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వివరించారు.  

కమ్మపాళెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదార్చి, అక్కడి నుంచి చెన్నారెడ్డిపల్లె క్రాస్, సుద్దగుండ్ల పల్లె క్రాస్, కెళవాతి క్రాస్, వీరప్పల్లె, కొత్త వీరప్పల్లె, ఎ.కొత్తకోట క్రాస్, దాదేపల్లెల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారని తెలిపారు. దుర్గ సముద్రంలో తోటి శంకరమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారని, ఆ తర్వాత చారాలలో వై ఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. శెట్టిపల్లె, చిట్టిరెడ్డి పల్లెల్లో రోడ్‌షో నిర్వహించి రాత్రికి చౌడేపల్లెలో జగన్‌మోహన్‌రెడ్డి బస చేస్తారని వారు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement