అప్పు తీర్చలేదన్న కోపంతో వృద్ధ దంపతులపై వడ్డీ వ్యాపారి దాడి ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
గుంటూరు : అప్పు తీర్చలేదన్న కోపంతో వృద్ధ దంపతులపై వడ్డీ వ్యాపారి దాడి ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రిక్షా కార్మికుడైన రాంబాబు, అతడి భార్య పార్వతమ్మలను కన్నకొడుకే కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో వృద్ధులిద్దరూ గాయపడగా .. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా బాపట్ల కొట్రావారివీధి నివాసి రాంబాబు తరచూ అప్పులు చేస్తుండడం, ఆ అప్పులు తీర్చమంటూ అందరూ ఇంటికి వచ్చి గొడవలు చేయడం, అతడి కొడుకు శ్రీనివాసరావుకు నచ్చలేదు.
దీంతో అసలు తల్లిదండ్రులు లేకపోతే .. ఈ రచ్చే ఉండదనుకున్నాడు. పీకల్దాకా తాగొచ్చిన శ్రీనివాసరావు, ఆ మైకంలో కత్తితో తల్లిదండ్రులను గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన రాంబాబు అసలు విషయం చెబితే ఎక్కడ కొడుకుపై కేసు అవుతుందోనని భయపడి .. మీడియా ఎదుట వడ్డీ వ్యాపారి దాడి చేశాడంటూ చెప్పాడు. దాంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.