లీకేజీపై నెటిజన్ల సెటైర్ల హోరు | Social media satires on rain water pours into ys jagan newly-constructed assembly chamber, social media | Sakshi
Sakshi News home page

లీకేజీపై నెటిజన్ల సెటైర్ల హోరు

Jun 9 2017 12:09 PM | Updated on Oct 22 2018 6:05 PM

తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల లీకేజీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు హోరెత్తుతున్నాయి.

అమరావతి: తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల లీకేజీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు హోరెత్తుతున్నాయి. రూ.వేయి కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలు తేలికపాటి వర్షానికే ధారాళంగా కారుతుండడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

‘మీరు ఊహిస్తున్నట్లు చెంచా సిమెంటుకు బస్తా ఇసుక కలపలేదు. వెయ్యికోట్ల సచివాలయమే ఇలా కట్టిస్తే ఇక రెండు లక్షల కోట్ల రాజధానిని ఎలా కట్టిస్తామో అనే కదా మీ సందేహం? అప్పుడు పిడుగులు కూడా నేరుగా భవనాల్లోనే పడే టెక్నాలజీ తెచ్చి చూపిస్తాం..’ అంటూ ఒక నెటిజన్‌ భవిష్యత్తును ఆవిష్కరించాడు. సోషల్‌ మీడియా సెటైర్‌లలో కొన్ని..


సచివాలయంలో కాగితపు పడవల పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పన         

‘సార్‌ నాకు రెండు వారాలు లీవ్‌ కావాలి’
‘రెండు వారాలా? ఎందుకు?’
‘‘ఈత నేర్చుకోవడానికి సార్‌.. ఈ రోజు చూశారుగా,
 వర్షం వస్తే ఆఫీసు    
లో కూర్చుని పనిచేయడానికి లేదు.. ఈదుతూ పనిచేయాలి!!’
‘‘నిజమేనోయ్‌.. టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి మరి!’
‘అంతర్జాతీయ స్థాయంటే ఆమాత్రం ఉండొద్దూ!’    

నాన్నారూ నాన్నారూ సచివాలయంలో పుష్కరాలు ఏర్పాటుచేస్తే ఎలా ఉంటదంటారు?     

సహజంగా వాటర్‌ ఫాల్స్‌ అడవుల్లోనో, కొండలమీదనో ఉంటాయి. కానీ మన చంద్రన్న ఏకంగా అసెంబ్లీలోనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. అది కూడా బల్బుల నుంచి, ఫ్యాన్ల నుంచి, ఏసీల నుంచి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడమంటే మాటలు కాదు. బహుశా దానికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ వాడి ఉండొచ్చు. ఈ వాటర్‌ఫాల్స్‌ కూడా అతి సహజంగా ఉండేలా చేయడం కోసం ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం.     
    
అపార్థం చేసుకోకండి. వర్షాన్ని చూస్తూ పనిచేస్తుంటే ఆనందంగా ఉంటుంది అని అలా కట్టించాము. అంతే తప్ప తెలియకకాదు. అది లేటెస్టు టెక్నాలజీ అని తెలుసుకోండి. ఇక జగన్‌ చాంబర్లో అలా కావాలనే సహజ జలపాతం ఏర్పాటు చేశాం. ఆయనకు మా మీద కోపం ఎక్కువ కదా.. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలని అలా వర్షపు ధారలు పడే వీలు కల్పించాం. అంతేకానీ మీరు ఊహిస్తున్నట్లు చెంచా సిమెంటుకు బస్తా ఇసుక కలపలేదు.


వెయ్యికోట్ల సచివాలయమే ఇలా కట్టిస్తే ఇక రెండు లక్షల కోట్ల రాజధానిని ఎలా కట్టిస్తామో అనే కదా మీ సందేహం? అప్పుడు పిడుగులు కూడా నేరుగా భవనాల్లోనే పడే టెక్నాలజీ తెచ్చి చూపిస్తాం.
 
అధ్యక్షా..!
ఈ నీళ్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ, ప్రతిపక్ష నాయకుడు జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, భారత ప్రధాని మోదీ గార్లు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం..
చేస్తాం.. చేస్తాం... ఎందుకు చేయం..

ఆయన: ఎవడయ్యా కాంట్రాక్టరు పిలవండి
కాంట్రాక్టర్‌: సార్‌
ఆయన: ఏమిటయ్యా ఒక్క వర్షానికే కురిసేలా కట్టావు
కాంట్రాక్టర్‌: మేము మోసపోయాం సార్‌
ఆయన: ఎందుకయ్యా
కాంట్రాక్టర్‌: మీరు ఉన్న చోట వర్షాలు పడవని అధికారులు చెప్పారు సార్‌
    
మీకు కుళ్లు. పాపం ఆయన ఎక్కడ ఉన్నా వర్షం పడదు అని ఆడిపోసుకుంటారు. ఇప్పుడు చూడు ఏకంగా అసెంబ్లీలోనే వరద తెప్పించాడు.
ఓరి దీంతస్సాదియ్యా, ఈ టెక్నాలజీ ఏదో బాగుందే!!
న్యూజిలాండ్‌ నుంచి ల్యాండ్‌ లైనుకి మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాంబరు సీలింగ్‌ పగిలి లోపలికి నీళ్లొచ్చాయా??! కేకంతే.
ముందే చెప్పారు ఇవి తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం అని. మీరే అవి పర్మనెంట్‌ అని ఆశపడ్డారు. పాపం వాళ్ల తప్పేమీ లేదు.
ప్రపంచస్థాయి కట్టడాలు లీక్‌ అవుతాయా?? పైగా విజనరీ కట్టినవి..!!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement