స్కేటింగ్ చిచ్చరపిడుగు

స్కేటింగ్ చిచ్చరపిడుగు - Sakshi


40 సుమోల కింద దూసుకెళ్లిన క్రీడాకారుడు

 

తిరుపతి: తిరుపతికి చెందిన దేవీప్రసాద్ (8) స్కేటింగ్‌లో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. మూడో తరగతి చదువుతున్న ఇతను తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం సమీపంలో గురువారం 40 సుమో వాహనాల  కింద 7 అంగుళాల ఎత్తులో తన రెండు కాళ్లును బ్యాలెన్స్ చేసుకుంటూ శరీరాన్ని నేలకు తగలకుండా సమాంతరంగా 15 సెకన్లలో 110 మీటర్లు దూసుకెళ్లే ఫీట్‌ను చేసి చూపించాడు.  వెనుక నుంచి అదే దూరాన్ని 21.24 సెకన్లలో చేరుకుని ఔరా అనిపించాడు. ఈ స్కేటింగ్ వీడియోలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం పంపిస్తున్నామని దేవీప్రసాద్ తండ్రి లోకనాథం తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top