‘పట్టు’ తప్పుతోంది! | Shortage of officers in the Department of the silk industry | Sakshi
Sakshi News home page

‘పట్టు’ తప్పుతోంది!

Jul 9 2014 2:02 AM | Updated on Sep 2 2017 10:00 AM

సిబ్బంది కొరతతో జిల్లాలో పట్టుపరిశ్రమ శాఖ తన లక్ష్యాలను సాధించలేకపోతోంది.

కర్నూలు(అగ్రికల్చర్): సిబ్బంది కొరతతో జిల్లాలో పట్టుపరిశ్రమ శాఖ తన లక్ష్యాలను సాధించలేకపోతోంది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది (2014-2015 సంవత్సరానికి) లక్ష్యాన్ని పెంచి 1028.274 మెట్రిక్ టన్నుల పట్టు గూళ్లు ఉత్పత్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెరికల్చర్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లా స్థాయిలో సెరికల్చర్ ఉప సంచాలకుల పోస్టు దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. అనంతపురం జిల్లా సెరికల్చర్ జేడీ ఇక్కడ డీడీగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 ఆత్మకూరు, ప్యాపిలిలో ఏడీ పోస్టులుండగా ఆత్మకూరులో ఇన్‌చార్జి ఏడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెరికల్చర్ ఆఫీసర్ల పోస్టులు తొమ్మిది ఉండగా ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారు. అసిస్టెంటు సెరికల్చర్ ఆఫీసర్‌పోస్టులది ఇదే కథ. ఎనిమిది మందికిగాను నలుగురు మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికేడాది పట్టు సాగు తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరం 197 ఎకరాల్లో (ప్యాపిలి, వెల్దుర్తి, ఆత్మకూరు, నందికొట్కూరు ఆదోని ప్రాంతాల్లో) మల్బరీ సాగయింది. సబ్సిడీ వివరాలకు జిల్లా పట్టుపరిశ్రమ శాఖ ఉపసంచాలకులు అరుణకుమారి- 9866559547.  ఆత్మకూరు ఏడీ -9866557851, ప్యాపిలి ఏడీ -9866699181 సెల్‌నంబర్లను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement