ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పులు | shooting at Nandigama due to financial disputes, says krishna district SP | Sakshi
Sakshi News home page

ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పులు

Oct 28 2014 1:23 PM | Updated on Oct 2 2018 2:30 PM

ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే శ్రీశైల వాసుపై కాల్పులు జరిగినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.

విజయవాడ : ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే శ్రీశైల వాసుపై కాల్పులు జరిగినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ మృతుడు శ్రీశైల వాసు మేనల్లుడు గున్నం హనుమంతరావు తన స్నేహితుడు పాషా సాయంతో ఈ కాల్పులకు పాల్పడినట్లు వెల్లడించారు. శ్రీశైల వాసు తన మేనల్లుడికి రూ.కోటి బాకీ ఉన్నట్లు, ఈ నేపథ్యంలోనే వారి మధ్య గతంలో గొడవ జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు.

నిందితులు పోలీసులకు లొంగిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. నిందితుల  ఆచూకీ కోసం నల్గొండ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా పోలీసులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నందిగామలో ఈరోజు ఉదయం జరిగిన కాల్పుల్లో శ్రీశైల వాసు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement