రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికకోసం సూచనలు చేయడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది.
రాజధాని అంశంపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికకోసం సూచనలు చేయడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. కమిటీ కొద్దిరోజుల కిందట సీఎంతో సమావేశం కావాలనుకున్నా వీలు పడలేదు. ఈ నేపథ్యంలో కమిటీ శనివారం ఆయనతో సమావేశమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని అంశంపై చర్చించనుంది. కమిటీ సభ్యులు ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలను సందర్శించి వివిధ రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపారు.
మరోవైపు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఒకవేళ ఈ రెండు నగరాల మధ్య అవకాశం లేనిపక్షంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసే విషయమై గురువారం విశాఖపట్నంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో కమిటీ సమావే శం ప్రాధాన్యం సంతరించుకుంది.