శకుంతల దీక్షకు మద్దతు | Shakuntala Strike support | Sakshi
Sakshi News home page

శకుంతల దీక్షకు మద్దతు

Feb 9 2014 1:05 AM | Updated on Aug 24 2018 2:33 PM

కాపురాన్ని నిలబెట్టాలని శకుంతుల నాగార్జున చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ఆమెకు మద్దతు తెలుపుతూ శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో

రేపల్లె రూరల్, న్యూస్‌లైన్ :కాపురాన్ని నిలబెట్టాలని శకుంతుల నాగార్జున చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ఆమెకు మద్దతు తెలుపుతూ  శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు శకుంతుల దీక్ష చేస్తున్న ఇంటి వద్ద నుంచి వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ సెంటర్‌లోని శకుంతుల మామయ్య రామారావు నిర్వహిస్తున్న షాపు ఎదుట మెయిన్‌రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తాలూకా సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి కృష్ణ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శివరాఘవయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి జంపాని చెన్నకేశవరావు, దేశభక్త ప్రజాతంత్ర ఉధ్యమం జిల్లా నాయకుడు సుబ్బారావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కోలా సంజీవరావు, మహిళా సంఘం నాయకులు, కృష్ణబలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. 
 
 విద్యార్థినుల ర్యాలీ..
 శకుంతులకు మద్దతు తెలుపుతూ ఏబీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు  శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విద్యార్థినులతో మాట్లాడుతున్న సమయంలో తమ బాధలను చెప్పుకుంటూ విలపించిన శకుంతులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.కిరణ్, కె.బసవయ్య, ఎ.లలితాదేవి, సీహెచ్ మౌనిక, జ్యోతి, లక్ష్మీగంగ తదితరులు పాల్గొన్నారు. సోషల్ యాక్షన్ కమిటీ జిల్లా కోశాధికారి గిరిజ  శకుంతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.  చైతన్యవేదిక కన్వీనర్ కొండపల్లి వెంకటేశ్వరరావు శకుంతులను కలసి న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాడతామని భరోసా ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement