మానసిక వికలాంగురాలిపై లైంగికదాడికి యత్నం | sexual assault attempt on Psychosocial Care | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగురాలిపై లైంగికదాడికి యత్నం

Feb 8 2014 3:40 AM | Updated on Jul 23 2018 9:13 PM

మానసిక వికలాంగురాలిపై ఓ మృగాడు లైంగిక దాడికి విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన మండలంలోని శీతానాగులవరంలో గురువారం సాయంత్రం జరిగింది.

 తర్లుపాడు, న్యూస్‌లైన్ : మానసిక వికలాంగురాలిపై ఓ మృగాడు లైంగిక దాడికి విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన మండలంలోని శీతానాగులవరంలో గురువారం సాయంత్రం జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సీఐ కె.వెంకటేశ్వరరావులు శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఆమె పశువుల మేత కోసం వామి దొడ్డిలోకి వెళ్లగా అదే గ్రామానికి చెందిన పి.నారాయణ అనే యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
 
 జరుగుమల్లిలో కూడా..
 జరుగుమల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రం జరుగుమల్లిలో కూడా మానసిక వికలాంగ బాలికపై మరో మృగాడు లైంగిక దాడికి విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన స్థానిక ఆదిఆంధ్ర కాలనీలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలిక మానసిక వికలాంగురాలు. రోజూ స్థానిక మనోవికాస కేంద్రానికి వెళ్తుంటుంది. బాలిక మనోవికాస కేంద్రం నుంచి ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన దేవరపల్లి హరిబాబుకు ఆమెపై కన్ను పడింది. ఆ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉండి బాలికను హరిబాబు లోపలికి పిలిచాడు.

 అనంతరం లైంగిక దాడికి యత్నించగా బాలిక కేకలు వేసి అతడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాధితురాలు భోరున విలపించి జరిగిన సంఘటన గురించి పూస గుచ్చింది. బాలిక తల్లి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ జాషువా, సింగరాయకొండ సీఐ రాంబాబు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement