బ్యాంకులకు వరుస సెలవుల కారణంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించే పరిస్థితి ఎదురుకానుంది. శుక్రవారం నుంచి అక్టోబర్ 5 వరకు మధ్యలో 3 రోజుల మినహా మిగిలిన
అక్టోబర్ 5 వరకు మధ్యలో 3 రోజులే సేవలు
స్తంభించనున్న ఆర్థిక లావాదేవీలు
తాడేపల్లిగూడెం : బ్యాంకులకు వరుస సెలవుల కారణంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించే పరిస్థితి ఎదురుకానుంది. శుక్రవారం నుంచి అక్టోబర్ 5 వరకు మధ్యలో 3 రోజుల మినహా మిగిలిన రోజులు సెలవులు వచ్చారుు. శుక్రవారం బక్రీద్ సందర్భంగా సెలవు కాగా శనివారం నెలలో నాలుగోది కావడంతో కొత్త మార్గదర్శకాల ప్రకారం సెలవు. ఆదివారం వారాంతపు సెలవు. బ్యాంకులు తిరిగి సోమ, మంగళవారాలు పనిచేస్తాయి. సెప్టెంబరు 30, అక్టోబరు ఒకటో తేదీలు అర్థసంవత్సర లెక్కల ముగింపు సందర్భంగా ఖాతాదారులకు సేవలు అందించవు. అక్టోబరు రెండో తేదీన గాంధీ జయంతి సెలవు. అక్టోబరు మూడో తేదీ శనివారం కావడంతో బ్యాంకులు సాయంత్రం వరకు పనిచేస్తాయి. అక్టోబరు 4న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఇలా వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో బ్యాంకుల్లో లావాదేవీలకు ఇబ్బంది ఏర్పడే అవకాశాలున్నాయి.