ముందుకు వస్తున్న సముద్రం, ఆందోళనలో స్థానికులు | Sea water waves moves ahead at Vizainagaram district | Sakshi
Sakshi News home page

ముందుకు వస్తున్న సముద్రం, ఆందోళనలో స్థానికులు

May 19 2015 6:58 PM | Updated on Sep 3 2017 2:19 AM

ముందుకు వస్తున్న సముద్రం, ఆందోళనలో స్థానికులు

ముందుకు వస్తున్న సముద్రం, ఆందోళనలో స్థానికులు

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో సాగర జలాలు ముందుకు చొచ్చుకు వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో సాగర జలాలు ముందుకు చొచ్చుకు వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తీర గ్రామమైన ఇక్కడ జాలర్ల ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. తీరానికి సమీపంలోనే వీరి ఇళ్లు ఉంటాయి. అయితే, వారం రోజుల నుంచీ సాగర జలాలు తీర రేఖను దాటుకుని 100 మీటర్ల వరకూ ముందుకు వస్తున్నాయి.

సముద్ర అలలు కొన్ని ఇళ్లను కూడా తాకుతుండడంతో వారు భయంతో గడుపుతున్నారు. ఆటుపోట్ల సమయంలో సముద్ర జలాలు ముందుకు వస్తుంటాయని, అయితే, ఈ స్థాయిలో ముందుకు రావడం ఇదే మొదటి సారని స్థానికులు అంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఈ ఉధృతి మొదలై మధ్యాహ్నానికి తగ్గుతున్నట్టు తెలిపారు. ఫొటోలో కనిపించే భవనానికి 50 మీటర్ల దూరంలో ఉండే జలాలు... మంగళవారం ఉదయం 11 గంటల సమంలో ఏ మేర ముందుకొచ్చాయే గమనించవచ్చు.

Advertisement

పోల్

Advertisement