సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బీచ్ వద్దకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సముద్రంలో మునిగిపోతుండటం గమనించిన లైఫ్ గార్డులు సురక్షితంగా అతడిని రక్షించారు. సదరు విద్యార్థి సురక్షితంగా బయటకు రావడంతో, కుటుంబ సభ్యులు, అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
విశాఖ ఆర్కే బీచ్‌లో తప్పిన ప్రమాదం.
టెన్త్ విద్యార్థిని అలలకు కొట్టుకుపోగా, లైఫ్ గార్డులు సురక్షితంగా రక్షించారు.#Visakhapatnam #RKBeach pic.twitter.com/sU43mXZcaK— greatandhra (@greatandhranews) October 26, 2025


