breaking news
Sea water waves
-
ఆర్కే బీచ్లో తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బీచ్ వద్దకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సముద్రంలో మునిగిపోతుండటం గమనించిన లైఫ్ గార్డులు సురక్షితంగా అతడిని రక్షించారు. సదరు విద్యార్థి సురక్షితంగా బయటకు రావడంతో, కుటుంబ సభ్యులు, అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. విశాఖ ఆర్కే బీచ్లో తప్పిన ప్రమాదం.టెన్త్ విద్యార్థిని అలలకు కొట్టుకుపోగా, లైఫ్ గార్డులు సురక్షితంగా రక్షించారు.#Visakhapatnam #RKBeach pic.twitter.com/sU43mXZcaK— greatandhra (@greatandhranews) October 26, 2025 -
ముందుకు వస్తున్న సముద్రం, ఆందోళనలో స్థానికులు
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో సాగర జలాలు ముందుకు చొచ్చుకు వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తీర గ్రామమైన ఇక్కడ జాలర్ల ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. తీరానికి సమీపంలోనే వీరి ఇళ్లు ఉంటాయి. అయితే, వారం రోజుల నుంచీ సాగర జలాలు తీర రేఖను దాటుకుని 100 మీటర్ల వరకూ ముందుకు వస్తున్నాయి. సముద్ర అలలు కొన్ని ఇళ్లను కూడా తాకుతుండడంతో వారు భయంతో గడుపుతున్నారు. ఆటుపోట్ల సమయంలో సముద్ర జలాలు ముందుకు వస్తుంటాయని, అయితే, ఈ స్థాయిలో ముందుకు రావడం ఇదే మొదటి సారని స్థానికులు అంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఈ ఉధృతి మొదలై మధ్యాహ్నానికి తగ్గుతున్నట్టు తెలిపారు. ఫొటోలో కనిపించే భవనానికి 50 మీటర్ల దూరంలో ఉండే జలాలు... మంగళవారం ఉదయం 11 గంటల సమంలో ఏ మేర ముందుకొచ్చాయే గమనించవచ్చు.


