ప్రతి ఒక్కరికీ సంతృప్తికర దర్శనం
పేద, ధనిక, చిన్నా, పెద్దా తేడా లేకుండా భక్తులందరూ కనులారా శ్రీవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేద, ధనిక, చిన్నా, పెద్దా తేడా లేకుండా భక్తులందరూ కనులారా శ్రీవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఈ నెల 23 నుంచి మొదలయ్యే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేసేందుకు సహకరించాలని ప్రభుత్వ శాఖలతో పాటు భక్తులు, మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నాం. రోజువారీ సుప్రభాతం, శుక్రవారపు అభిషేకాలు మాత్రం కొనసాగుతాయి. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నాం’’ అని తెలిపారు.