క్షీణించిన ఉదయభాను ఆరోగ్యం | Samineni Udayabhanu health deteriorated says Doctors | Sakshi
Sakshi News home page

క్షీణించిన ఉదయభాను ఆరోగ్యం

Oct 5 2013 2:04 PM | Updated on Sep 1 2017 11:22 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆరోగ్యం క్షీణించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన జగ్గయ్యపేటలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

జగ్గయ్యపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆరోగ్యం క్షీణించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన జగ్గయ్యపేటలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఉదయభాను ఆరోగ్యం క్షీణించటంతో... ఆయనను దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చేపట్టిన సమైక్య సత్యాగ్రహాలకు మద్దతు వెల్లువెత్తుతోంది. గాంధీజయంతి రోజున ప్రారంభమైన ఈ దీక్షలు శనివారం కూడా  కొనసాగుతున్నాయి. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య దీక్షకు మద్దతుగా విజయవాడలో వంగవీటి రాధా దీక్ష చేపట్టారు.

ఇక విజయవాడ సెంట్రల్‌లో పి.గౌతమ్‌రెడ్డి, గన్నవరంలో దుట్టా రవిశంకర్, పెడనలో వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్‌లు దీక్షలను కొనసాగిస్తున్నారు. గొల్లపూడిలో కాజా రాజ్‌కుమార్ రిలే దీక్షలో పాల్గొన్నారు. బందరులో తాజా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), కేంద్ర పాలకమండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు, పలువురు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. గుడివాడలో తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement