
నెల్లూరు(బృందావనం): ప్రముఖ సినీనటి సమంత అక్కినేని మినీబైపాస్ రోడ్డు, రామమూర్తినగర్‌లోని ఉడ్‌లాండ్ షోరూంపైన నెల్లూరులో మొట్టమొదటి ‘లాక్మే సెలూన్’ ఫ్రాంచైజీని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందం, గ్రూమింగ్ విభాగాల్లో అత్యుత్తమ సేవలందించే ‘లాక్మే సెలూన్’ నెల్లూరులో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ బ్యాక్ స్టేజ్ నిపుణులు అత్యాధునిక ధోరణులను నెల్లూరీయుల చెంతకు చేర్చారన్నారు.
వోగ్ హెయిర్ స్టైల్స్‌లో గ్లామరస్ హైలెట్స్ మొదలు పునరుత్తేజం కలిగించే ఫేషియల్స్, ఒత్తిడి తగ్గించే మసాజ్‌లు, క్లాస్సీ మేనిక్యూర్స్, పెడిక్యూర్స్ వరకూ అన్నింటినీ అందించడంలో లాక్మే సెలూన్ అగ్రగామిగా ఉందని అన్నారు. నెల్లూరు రావడం, అభిమానులను చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంస్థ సీఈఓ పుష్పరాజ్ షెహనాయ్ మాట్లాడుతూ దేశంలోని 110 నగరాల్లో 380కి పైగా లాక్మే సెలూన్స్ విశిష్ట సేవలందిస్తున్నాయన్నారు. లాక్మే సెలూన్ ఫ్రాంచైజీ లీలాసాయికుమార్ మాదా మాట్లాడుతూ అత్యంత నమ్మకమైన బ్యూటీ సర్వీసెస్ బ్రాండ్ లాక్మే సెలూన్ నెల్లూరులో ప్రారంభించడం హర్షణీయమన్నారు.