
జగన్ నాయకత్వంలోనే సమైక్య రాష్ట్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు.
ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచుకోవడం కోసం అందరూ ముందుకురావాలన్నారు. ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుందాం అని ఆయన అన్ని పార్టీల నేతలకు పిలుపు ఇచ్చారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిచ్చి మాటలు మానుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పటికైనా ఆయన సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరారు.