త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు: అశోక్‌బాబు | Samaikyandhra Political JAC to be formed soon: Ashok Babu | Sakshi
Sakshi News home page

త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు: అశోక్‌బాబు

Dec 13 2013 6:14 PM | Updated on Sep 2 2017 1:34 AM

త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు: అశోక్‌బాబు

త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు: అశోక్‌బాబు

తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ప్రజాసంఘాలకు ఇవ్వాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ప్రజాసంఘాలకు ఇవ్వాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. తాము సాగిస్తున్న సమైక్య ఉద్యమానికి ఏపీఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు అడ్డురావన్నారు. రాజకీయ పక్షాలు ఏపీఎన్జీవోను ప్రభావితం చేయలేవని దీమా వ్యక్తం చేశారు. త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

వైఎస్‌ జగన్‌ను కలిసి అఖిలపక్షానికి ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశానికి వచ్చేది, లేనిది.. వైఎస్ జగన్ ఇష్టమన్నారు. రాజకీయ లబ్ధికోసమే దిగ్విజయ్‌ సింగ్ హైదరాబాద్ వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక ప్రకారం అసెంబ్లీని ముట్టడిస్తామని అశోక్‌బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement