ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం | sales girl missing in hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం

May 22 2014 8:55 PM | Updated on Aug 1 2018 2:15 PM

డ్యూటీకని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: డ్యూటీకని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... న్యూమారుతీ నగర్‌లో నివసించే ఆటోడ్రైవర్ కత్తుల పరశురాములు కూతురు మౌనిక(20) చైతన్యపురిలోని అనిల్ ట్రేడింగ్ షోరూంలో సేల్స్ గర్ల్‌గా పని చేస్తోంది.

మంగళవారం డ్యూటీకని వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. షోరూంలో వాకబు చేయగా తనతో పనిచేసే హాసినితో కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఆమెకు ఫోన్ చేయగా సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఎక్కడ వెతికినా జాడ తెలియక పోవటంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement