‘సాక్షి’ ఫొటో ఎడిటర్‌కి లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు | Sakshi Photo Editor Ravikanth Reddy Gets Lifetime Achievment Award From Spaap | Sakshi
Sakshi News home page

రవికాంత్‌రెడ్డికి లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు

Oct 12 2018 3:32 AM | Updated on Oct 12 2018 3:32 AM

Sakshi Photo Editor Ravikanth Reddy Gets Lifetime Achievment Award From Spaap

సాక్షి, అమరావతి: స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ మూడో జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’ఫొటో ఎడిటర్‌ కె.రవికాంత్‌రెడ్డికి లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్‌ దండమూరి సీతారామ్, ఈనాడు దినపత్రిక సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ కేశవులు కూడా ఎంపికయ్యారు. 2018వ సంవత్సరానికి స్పాట్, జనరల్‌ న్యూస్, పర్యాటకం అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 18 రాష్ట్రాల నుంచి 1,890 ఫొటోలు ఎంట్రీలుగా నమోదయ్యాయి. ముంబైకి చెందిన ఫోర్బ్స్‌ పత్రిక చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌ వికాస్‌ కోట్, ఈనాడు జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎం.నాగేశ్వరరావు, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆర్‌బీ కోటేశ్వరరావులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ‘సాక్షి’ఫొటో జర్నలిస్ట్‌లకు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. బహుమతుల్ని నవంబర్‌ 1న విజయవాడ కల్చరల్‌ సెంటర్‌లో ప్రదానం చేస్తారని స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement