‘సాక్షి ఇండియా స్పెల్ బీ’కి రిజిస్ట్రేషన్లు ప్రారంభం | Sakshi
Sakshi News home page

‘సాక్షి ఇండియా స్పెల్ బీ’కి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Published Sat, Aug 2 2014 4:08 AM

‘సాక్షి ఇండియా స్పెల్ బీ’కి  రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా పదాల స్పెల్లింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే ఈ పోటీలకు శుక్రవారం (1వ తేదీ) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. సోమవారం (4వ తేదీ) వరకూ నమోదు చేసుకోవచ్చు. ఈ పోటీలకు ఠీఠీఠీ.జీఛీజ్చీ టఞ్ఛఛ్ఛ్ఛ.జీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా 9505551099, 9705199924, 040-23322330/ 23256134 నంబర్లలో సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలు, వ్యాకరణంతో కూడిన రిఫరెన్స్ బుక్‌ను కూడా అందజేస్తారు. నాలుగు కేటగిరీల్లో జరిగే ఈ పోటీల్లో మొదటి కేటగిరీలో ఒకటి, రెండో తరగతులు.. రెండో కేటగిరీలో మూడు, నాలుగు తరగతులు.. మూడో కేటగిరీలో ఐదు, ఆరు, ఏడు తరగతులు.. నాల్గో కేటగిరీలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పోటీ జరుగుతుంది. ఈ పోటీలు నాలుగు దశల్లో జరుగుతాయి. మూడు దశలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంయుక్తంగా నిర్వహిస్తుండగా.. నాలుగో దశ అయిన ఫైనల్స్‌ను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా నిర్వహిస్తారు.

తొలిదశ (ప్రిలిమినరీస్)లో పాఠశాలల స్థాయిలో ‘ఇండియా స్పెల్లింగ్ బీ’ ప్రశ్నపత్రంతో అక్టోబర్ 15న రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులతో రెండో దశ (క్వార్టర్ ఫైనల్స్)లో నవంబర్ 9న జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో సాక్షి టీవీ ద్వారా నిపుణులు లైవ్‌లో ఆంగ్ల పదాలను విద్యార్థులకు చెబుతుంటే.. సమాధాన పత్రంపై రాయాల్సి ఉంటుంది. మూడో దశ (సెమీ ఫైనల్స్)లో కూడా రెండో దశ తరహాలోనే పరీక్ష ఉంటుంది. ఎంపికైన విద్యార్థులతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో పోటీ నిర్వహిస్తారు. ఇక నాలుగో దశ అయిన ఫైనల్స్ కోసం ఒక్కో కేటగిరీ నుంచి పది మంది విద్యార్థులను ఎంపిక చేసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హైదరాబాద్‌లో పోటీ నిర్వహిస్తారు. ఫైనల్ విజేతలకు ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా.. మొదటి బహుమతి కింద బంగారు పతకం, రూ. 25 వేల నగదు అందజేస్తారు. రెండో బహుమతిగా రజత పతకం, రూ. 15 వేల నగదు.. మూడో బహుమతిగా కాంస్య పతకం, రూ. 10 వేల నగదు అందజేస్తారు. రెండు, మూడో దశల్లో లైవ్‌గా నిర్వహించే ఈ పోటీల్లో ప్రేక్షకులు కూడా స్పెల్లింగ్‌లను వెంటనే ఎస్సెమ్మెస్ చేసి బహుమతులు పొందవచ్చు.
 
 

Advertisement
Advertisement