డిసెంబర్‌కు సాగర్‌మాల డీపీఆర్‌ పూర్తి | Sagarmala DPR will be complete in December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌కు సాగర్‌మాల డీపీఆర్‌ పూర్తి

May 30 2017 1:59 AM | Updated on Sep 5 2017 12:17 PM

డిసెంబర్‌కు సాగర్‌మాల డీపీఆర్‌ పూర్తి

డిసెంబర్‌కు సాగర్‌మాల డీపీఆర్‌ పూర్తి

సాగర్‌మాల పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో చేపట్టనున్న ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన

 
సాక్షి, న్యూఢిల్లీ: సాగర్‌మాల పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో చేపట్టనున్న ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, జల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి సోమవారం ఇక్కడ వివరించారు. ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, జల రవాణా శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై వెంకయ్య నాయుడు గడ్కరీతో కలసి సమీక్షించారు.

సాగరమాల బకింగ్‌హం కాలువ అభివృద్ధి పనులు, జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, అమరావతి రింగ్‌రోడ్డు నిర్మాణానికి నిధులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సాగరమల, బకింగ్‌హం కాలువ ప్రాజెక్టులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపామని, డీపీఆర్‌ పూర్తయిన వెంటనే తదుపరి చర్యలు చేపడతామని గడ్కరీ వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement