ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ కొరడా | RTA Officers Checking Private Vehicles In Vijayawada National Highway | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ కొరడా

Oct 9 2019 9:28 AM | Updated on Oct 9 2019 9:45 AM

RTA Officers Checking Private Vehicles In Vijayawada National Highway - Sakshi

కృష్ణాజిల్లా : పండగ వేళ తీవ్ర రద్దీగా ఉన్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. మంగళవారం రాత్రి ఆర్టీఏ అధికారి ఎంవీఐ ప్రవీణ్‌ అధ్వర్యంలో  ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 36 బస్సులను గుర్తించి.. కేసులు నమోదు చేశారు. మార్నింగ్ స్టార్, ఎస్‌వీఆర్‌, ఆరెంజ్, కావేరి ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌, విజయవాడ వైపు వెళ్తున్న 80కి పైగా బస్సులును తనిఖీ చేసిన అధికారులు ప్రయాణికుల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement