మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఆరెస్సెస్ కసరత్తు! | RSS leader meets Advani, Sushma to clear way for Modi | Sakshi
Sakshi News home page

మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఆరెస్సెస్ కసరత్తు!

Sep 3 2013 5:38 AM | Updated on Mar 29 2019 9:18 PM

గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం కట్టబెట్టేందుకు ఏకాభిప్రాయ సాధన కోసం ఆరెస్సెస్ కసరత్తు చేస్తోంది.

న్యూఢిల్లీ: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం కట్టబెట్టేందుకు ఏకాభిప్రాయ సాధన కోసం ఆరెస్సెస్ కసరత్తు చేస్తోంది. సంస్థ సీనియర్ నేత సురేశ్ భయ్యాజీ జోషీ ఆదివారమిక్కడ ఈ అంశంపై పార్టీ సీని యర్ నేతలైన అద్వానీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీఅయ్యారు. ఈ భేటీలో మోడీని ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకురావాల్సిన అవసరం, ఆయనను ఎప్పుడు అభ్యర్థిగా ప్రకటించాలి వం టి వాటిపై భయ్యాజీ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మోడీ ప్రధాని అభ్యర్థిగా వద్దని అద్వానీ, సుష్మా తదితరులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆయనపై వ్యతిరేకతను తొలగించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాకే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అద్వానీ, సుష్మా చెబుతుండగా, అంతవరకు వేచి చూడొద్దని రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement