రూ. 58 లక్షల విలువైన బియ్యం బస్తాలు పట్టివేత | Rs. 58 lakhs worthed rice seized in nellore district | Sakshi
Sakshi News home page

రూ. 58 లక్షల విలువైన బియ్యం బస్తాలు పట్టివేత

Feb 15 2015 9:48 AM | Updated on Sep 2 2017 9:23 PM

నెల్లూరు నగరంలోని స్టోనౌన్ పేటలోని రైస్మిల్లుపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.

నెల్లూరు: నెల్లూరు నగరంలోని స్టోనౌన్ పేటలోని రైస్మిల్లుపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే జిల్లాలోని కావలి పట్టణంలో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు లారీలలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు లారీలను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ. 8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement