10 నుంచి రొట్టెల పండుగ

Roti Festival At Bara Shaheed Dargah from September 10 - Sakshi

     11న గంధం మహోత్సవం 

     10 లక్షల మంది     భక్తులు వస్తారని అంచనా 

     రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు  

     14న ముగియనున్న ఉత్సవం

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షాహిద్‌ దర్గాలో ఈనెల 10వ తేదీ నుంచి 14వరకు రొట్టెల పండుగ జరుగనుంది. రాష్ట్ర పండుగ హోదా కలి్పంచిన నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10న షహదాత్‌తో ప్రారంభమయ్యే రొట్టెల పండుగ 14న ముగియనుంది. ఆంధ్రా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు సౌదీ దేశాల్లో ఉంటున్న ముస్లింలు తరలివస్తారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు హాజరై వారి కోర్కెలకు అనుగుణంగా రొట్టెలు వదులుతారు. పది లక్షల మంది భక్తులకు సౌకర్యం కలి్పంచేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా బారా షాహిద్‌ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంతో పాటు కోర్కెల రొట్టెలు ఇచ్చే పవిత్ర స్వర్ణాల చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

11న గంధం మహోత్సవం.. 
రొట్టెల పండుగలో కీలకమైన గంధం మహోత్సవం ఈనెల 11వ తేదీన జరుగనుంది. 11న రాత్రి భారీ ఉరేగింపుగా గంధను దర్గాకు తీసుకొచ్చి     బారా షాహిద్‌లకు సమరి్పస్తారు. కార్యక్రమంలో కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్‌ ఆరీపుల్లా హుస్సేని పాల్గొంటారు. 10వ తేదీన షహదాత్, 11న గంధ మహోత్సవం, 12న రొట్టెల పండుగ, 13న తహలీల్‌ ఫాతేహ, 14న ముగింపు సభ జరుగుతుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top