ఎస్ఆర్ నగర్లో దొంగలు బీభత్సం | Robbers Make Hulchul at sr nagar in Hyderabad city | Sakshi
Sakshi News home page

ఎస్ఆర్ నగర్లో దొంగలు బీభత్సం

Feb 6 2014 9:59 AM | Updated on Aug 30 2018 5:27 PM

నగరంలో ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడి దొంగలు గత అర్థరాత్రి బీభత్సం సృష్టించారు.

నగరంలో ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడి దొంగలు గత అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని మూడు షాపులలో వరుస చోరీలకు పాల్పడ్డారు. గురువారం ఉదయం షాపు యజమానులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

 

పోలీసులు చోరీకి గురైన షాపులకు చేరుకుని, దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.  చోరీకి గురైన వివరాలను పోలీసులు షాపు యజమానుల నుంచి సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement