వైఎస్సార్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డుప్రమాదంలో దంపతుల దుర‍్మరణం
Jul 16 2017 1:36 PM | Updated on Jul 10 2019 8:00 PM
కడప: వైఎస్సార్ జిల్లాలోని సిద్ధవటం మండలం మాధవరం దగ్గర ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను.. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇన్నోవా కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement