తణుకులో మహిళా సదస్సు | RK Roja Womens Conference in tanuku | Sakshi
Sakshi News home page

తణుకులో మహిళా సదస్సు

Dec 1 2018 7:39 AM | Updated on Dec 1 2018 7:39 AM

RK Roja Womens Conference in tanuku - Sakshi

పశ్చిమగోదావరి, తణుకు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా తణుకులో శనివారం నిర్వహించనున్న జిల్లా మహిళా సదస్సులో పాల్గొంటారని ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కారుమూరివెంకట నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 2.30 గంటలకు సదస్సు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సభాస్థలి వద్ద పనులను కారుమూరి స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బలగం సీతారామం, పార్టీ నాయకులు ఉన్నారు.సదస్సులో పాల్గొన్న అనంతరం ఆర్‌కే రోజా సాయంత్రం 6 గంటలకు తణుకు క్రిస్టియన్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి విజయవాడ బయల్దేరి వెళతారు.

సదస్సుకు భారీగా తరలిరండి
అత్తిలి: తణుకు పట్టణంలో జరిగే జిల్లా స్థాయి మహిళా సదస్సుకు పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అబీబుద్దీన్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement