ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి గల కారణాలపై ఈ నెల 16న సమీక్షించనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి గల కారణాలపై ఈ నెల 16న సమీక్షించనున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణమే తమ అజెండా అని ఆ పార్టీకి చెందిన ఎంఎల్సీ రుద్రరాజు పద్మరాజు చెప్పారు.
వచ్చే నెల 13, 14న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన సాధారణ, స్థానిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఘోరపరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయింది.