
కిర్లంపూడి (జగ్గంపేట): కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం.. భోజనానికి పిలిచి టిఫిన్ పెట్టినట్లుగా ఉందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సంఖ్యా బలానికి అనుగుణంగా కాపులకు రిజర్వేషన్లు 10 నుంచి 12 శాతానికి పెంచాలని ఆయన శుక్రవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో ఆయన విడుదల చేశారు.