ప్రభుత్వం మొండిపట్టువీడాలి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మొండిపట్టువీడాలి

Published Sun, Oct 19 2014 1:33 AM

ప్రభుత్వం మొండిపట్టువీడాలి - Sakshi

ఒంగోలు సబర్బన్ : ప్రభుత్వం మొండిపట్టువీడి ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలని దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మీసేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టిన ఆందోళనను శనివారం రెండోరోజు కొనసాగించారు. జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముందుగా స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఆర్టీవో కార్యాలయం, నెల్లూరు బస్టాండ్ మీదుగా సంతపేటలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు.

డీఐజీ శ్రీనివాసరావుకు సమస్యపై వినతిపత్రం అందించారు. మీసేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే తలెత్తే సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను ఆయన నివాసంలో కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో దస్తావేజు లేఖ రుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు మోపర్తి హరిబాబు, జాయింట్ సెక్రటరీ గోపిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస చక్రవర్తి, కార్యదర్శి ఆత్మకూరి చంద్రశేఖర్, కోశాధికారి గోగూలమూడి బ్రహ్మానందరావు, కార్యవర్గ సభ్యులు పెళ్లూరి మాలకొండ నరసింహారావు, మహంకాళి వీరబ్రహ్మాచారి, పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement