ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్ | redwood smugglers are arrested | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్

Sep 24 2013 3:39 AM | Updated on Sep 1 2017 10:59 PM

ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సబ్‌డివిజన్ ఫారెస్టు అధికారి ఆర్‌డీ వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఆర్‌ఓ స్వామి వివేకానందలు తెలిపారు


 బద్వేలు అర్బన్, న్యూస్‌లైన్:
 ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో  ఏడుగురిని అరెస్టు చేసినట్లు సబ్‌డివిజన్ ఫారెస్టు అధికారి ఆర్‌డీ వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఆర్‌ఓ స్వామి వివేకానందలు తెలిపారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో  వివరాలు వెల్లడించారు. గతనెల 19న బాలాయపల్లె బీటు పరిధిలో దాడులు నిర్వహించి ఎర్రచందనం దుంగల తరలింపునకు సిద్ధంగా ఉన్న  బత్తల వెంకటసుబ్బ య్య, మాతా దానంలను అరెస్టు చేసి, దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా మరో 10మంది పారిపోయారని తెలిపారు. మిగిలిన వారు మళ్లీ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున దాడులు చేయగా, రేకులకుంటకు చెందిన  ఓబిలి ఓబయ్య అలియాస్ కర్రన్న, బత్తల వెంకటసుబ్బయ్య, బత్తల ఈశ్వర్, తప్పెట ఓబులేసు, నాగినేనిసుబ్బరాయుడు,కుమితి సుబ్బరాయుడు, శీలం గంగయ్యలు పట్టుబడ్డారని తెలిపారు.  
 
 నందలూరులో...
 చెరువులో దాచి ఉంచిన 26 ఎర్ర చందనం దుంగలను సోమవారం నందలూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ కౌలుట్లయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆదివారం రాత్రి మండల కేంద్రానికి సమీపంలోని కన్యకల చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా *.4.5 లక్షల విలుైవె న దుంగలు కనిపించాయి.  సోమవారం ఉదయం వాటిని స్టేషన్‌కు తరలించామన్నారు.
 
 60ఎర్రచందనం దుంగలు స్వాధీనం
 రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బాలుపల్లె ఎఫ్‌ఎస్‌ఓ పిచ్చయ్య తెలిపారు. స్థానిక  కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రేంజర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు శెట్టిగుంట తురకపల్లె బ్రిడ్జి వద్ద దాడులు నిర్వహించగా 60 దుంగలు పట్టుబడ్డాయన్నారు. వీటి బరువు రెండు టన్నులుంటుందని, *.2 లక్షల విలువ చేస్తాయన్నారు.
 
 రాజంపేటలో...
 అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్వో విజయకుమార్ తెలిపారు. గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద ఓ టెంపో ట్రావెలర్‌ను త నిఖీ చేయగా అందులో 41 దుంగలు పట్టుబడ్డాయన్నారు. రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద స్కార్పియోలో తరలిస్తున్న 23 దుంగలతోపాటు, రెండు వాహనాల ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement