శేషాచల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులపై తమిళ కూలీలు దాడలు చేశారు.
చిత్తూరు: శేషాచల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులపై తమిళ కూలీలు దాడలు చేశారు. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ఎర్రకూలీలు తారసపడటంతో వారిని అదుపులోకి తీసుకునే యత్నం చేయగా.. వారుఅధికారులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
శ్రీవారి మెట్టు సమీపంలోని గుర్రాల బావి వద్ద బుధవారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈసంఘటన ఎదురైంది. ఈ ఘటనలో తమిళ కూలీని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సుమారు 30 మంది తమిళ కూలీలు పాల్గొన్నట్లు సమాచారం.