సంగారెడ్డి మున్సిపాలిటీలో రికార్డులు మాయం? | Records were missed in sangareddy municipality | Sakshi
Sakshi News home page

సంగారెడ్డి మున్సిపాలిటీలో రికార్డులు మాయం?

Nov 4 2013 11:46 PM | Updated on Sep 2 2017 12:16 AM

స్థానిక మున్సిపాలిటీలో అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తడం సాధారణ విషయం గా మారింది.

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:  స్థానిక మున్సిపాలిటీలో అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తడం సాధారణ విషయం గా మారింది. ఈ దశలో కార్యాలయానికి చెందిన పలు రికార్డులు గల్లంతు కావడం అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో భద్రంగా ఉండాల్సి న రికార్డులు గల్లంతు కావడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతుంది. రికార్డులు గల్లంతు కావడంతో తాజాగా ఆడిటింగ్ నిలిచిపోయింది.
 సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో 2005 నుంచి 2009 వరకు వివిధ పద్దుల కింద రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పను లు చేపట్టారు. జనరల్ ఆడిటింగ్ అధికారులతోపాటు మున్సిపల్ ఆడిటింగ్ అధికారులు రికార్డులను పరిశీలించేందుకు గత మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కాగా ఇందులో సుమారు రూ.1.20 కోట్ల వి లువ చేసే పనులకు సంబంధించిన రికార్డులు లేకపోవడంతో ఆడిటింగ్ నిలిచిపోయింది. వచ్చిన అధికారులు ఏం చేయాలో పాలుపోక ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. రికార్డులు అందజేయాల్సిందిగా ఆడిటింగ్ అధికారులు కమిషనర్‌పై కూడా వత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. రికార్డుల విషయమై వివరాలు తెలపాల్సిం దిగా కమిషనర్ కృష్ణారెడ్డి గతంలో పనిచేసిన కమిషనర్లు, అకౌంటెంట్లకు లేఖలు రాశారు.

రికార్డులు ఛిద్రమయ్యాయని వారు సమాధా నం ఇచ్చినట్టు సమాచారం. రికార్డుల గల్లం తు విషయాన్ని మున్సిపల్ అధికారులు తేలి గ్గా తీసుకోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. రూ.1.20 కోట్ల విలువైన పనుల్లో అవి నీతి చోటు చేసుకోవడం వల్లే రికార్డులు గల్లం తు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైన రికార్డులను నెల రోజు ల్లోగా అందుబాటులో ఉంచాలని ఆడిటింగ్ అధికారులు సూచించినట్టు సమాచారం.
 రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నాం
 మున్సిపాలిటీలో రికార్డుల గల్లంతు అంశం నా దృష్టికి వచ్చింది. రికార్డులను ఆడిటింగ్ అధికారుల ముందు ఉంచేందుకు ప్రయత్నా లు చేస్తున్నా. రికార్డుల విషయమై గతంలో పనిచేసిన అకౌంటెంట్‌కు లేఖ రాసిన. రికార్డులు ఛిద్రమైనట్టు సమాధానమిచ్చారు. ఇది సరైంది కాదని పేర్కొంటూ అతనికి  మరో లేఖ రాస్తున్నా. సరిగా స్పందించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.
 - కృష్ణారెడ్డి, కమిషనర్, సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement