'ప్రభుత్వాలు ఏర్పడే వరకు ఫైళ్లకు ఫుల్‌స్టాప్‌' | Rajbhavan writes a letter to Chief secretaries on files clearence | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వాలు ఏర్పడే వరకు ఫైళ్లకు ఫుల్‌స్టాప్‌'

Published Fri, May 23 2014 4:38 PM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM

'ప్రభుత్వాలు ఏర్పడే వరకు ఫైళ్లకు ఫుల్‌స్టాప్‌' - Sakshi

'ప్రభుత్వాలు ఏర్పడే వరకు ఫైళ్లకు ఫుల్‌స్టాప్‌'

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యేంత వరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైళ్లను ఆపివేయాలని ప్రభుత్వ అధికారులకు రాజ్ భవన్ లేఖ రాసింది.

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యేంత  వరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైళ్లను ఆపివేయాలని ప్రభుత్వ అధికారులకు రాజ్ భవన్ లేఖ రాసింది.
 
అయితే రాష్ట్ర విభజనకు సంబంధించిన ఫైళ్లను మాత్రం పంపవచ్చని లేఖలో సూచించారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఫైళ్లు పంపొద్దని చీఫ్‌ సెక్రటరీ, గవర్నర్‌ సలహాదారులకు రాజ్‌భవన్‌ అధికారులు లేఖ రాశారు. 
 
జూన్ 2 తేదిన అధికారికంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించనుంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడబోయే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాజ్ భవన్ అధికారులు సంధించిన లేఖ ప్రకారం జూన్ 2 తేది తర్వాతే పాలన సంబంధిత ఫైళ్లకు మోక్షం లభించే అవకాశం కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement