ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఫోన్ చేశారు.
విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. దాంతో ఎన్కౌంటర్పై రాజ్నాథ్ సింగ్కు చంద్రబాబు వివరణ ఇచ్చారు. కాగా తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20మంది ఎర్రచందనం కూలీలు హతమైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఎన్కౌంటర్పై తమిళనాడు ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.