ట్రాక్టర్, బైక్ ఢీ.. స్టేషన్ మాస్టర్ మృతి | Railway station master died in tractor and bike accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్ ఢీ.. స్టేషన్ మాస్టర్ మృతి

Feb 18 2015 9:35 AM | Updated on Sep 2 2017 9:32 PM

ట్రాక్టర్ - బైక్ ఢీకొని రైల్వేస్టేషన్ మాస్టర్ మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో బుధవారం జరిగింది.

కొడవలూరు : ట్రాక్టర్ - బైక్ ఢీకొని రైల్వేస్టేషన్ మాస్టర్ మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో బుధవారం జరిగింది. వివరాలు.. నెల్లూరుకు చెందిన మునిస్వామి(50) తలమంచిలో రైల్వేస్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఆయన డ్యూటీకి బైక్‌పై వెళ్తుండగా కొడవలూరు రైల్వే గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement