కాలినడకన తిరుమలకు రాహుల్‌

Rahul Gandhi Reached Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి ‌: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. మెట్ల మార్గంలో ఆయన కేవలం రెండు గంటల్లో తిరుమల కొండ ఎక్కేశారు. పదేళ్ల అనంతరం రాహుల్‌ తిరుమల వచ్చారు. ఆయన సహచర భక్తులను పలకరిస్తూ ముందుకు సాగారు. స్వామివారి దర్శనం అనంతరం రాహుల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తోన్న ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా రాహుల్‌ శ్రీవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అంతకు ముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చిన రాహుల్‌ గాంధీకి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

స్వామివారి దర్శనం  అనంతరం శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా జ్యోతిరావు పూలే సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తారకరామ స్టేడియం వరకు బస్ యాత్ర చేస్తారు. అనంతరం తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ సభ నిర్వహించిన ప్రాంగణంలోనే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ సభ నిర్వహించడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top