రబీ వర్షపాతం అంతంతమాత్రమే! | Rabe rainfall within suffering! | Sakshi
Sakshi News home page

రబీ వర్షపాతం అంతంతమాత్రమే!

Oct 9 2014 1:14 AM | Updated on Sep 2 2017 2:32 PM

రబీ సీజన్‌లో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైంది. ఈ నెల ఒకటి నుంచి బుధవారం నాటికి సాధారణంగా 41.8

హైదరాబాద్: రబీ సీజన్‌లో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైంది. ఈ నెల ఒకటి నుంచి బుధవారం నాటికి సాధారణంగా 41.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 4.8 మిల్లీమీటర్లు (11.4%) మాత్రమే నమోదైంది. సహజంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదు. మొత్తం వార్షిక వర్షపాతంలో ఈశాన్య రుతుపవనాల ద్వారా వచ్చేది కేవలం 14 శాతమే ఉంటుంది.

ప్రస్తుతం తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలావుంటే ఖరీఫ్‌లో రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో మహబూబ్‌నగర్ మినహా 9 జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని వ్యవసాయశాఖ బుధవారం తన నివేదికలో వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement